ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1వ తేదీన జరగాల్సిన ఈ భేటీని ప్రభుత్వం వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1వ తేదీన జరగాల్సిన ఈ భేటీని ప్రభుత్వం వాయిదా వేసింది. వినాయక చవితి పండుగ, సీఎం జగన్‌ కడప పర్యటన నేపథ్యంలో.. కేబినెట్‌ భేటీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఏపీ ఉద్యోగులు అదే రోజున చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పిలపునివ్వడం కూడా కేబినెట్ భేటీ వాయిదాకు మరో కారణంగా తెలుస్తోంది. అయితే కేబినెట్ భేటీ ఎప్పుడు నిర్వహించనున్నారనే దానిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. 

ఇక, తొలుత ఈ నెల 29న కేబినెట్ భేటీ జరగనున్నట్టుగా ప్రభుత్వం తొలుత వెల్లడించింది. అయితే దానిని వాయిదా వేసినట్టుగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సెప్టెంబర్ ‌1న కేబినెట్ భేటీ జరగనున్నట్టుగా తెలిపింది. అయితే తాజాగా కేబినెట్ మరోసారి వాయిదా పడింది.