ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం (ap cabinet meeting) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం (ap cabinet meeting) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:

  • పీఆర్సీ జీవోలకు ఆమోదం 
  • పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపు
  • కారుణ్య నియామకాలకు ఆమోదం 
  • కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం
  • ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం
  • జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు
  • ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు
  • ఈబీసీ నేస్తం అమలుకు మంత్రివర్గం ఆమోదం
  • వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందానికి ఆమోదం
  • రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు అమలులో ఒప్పందం
  • ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా మంత్రివర్గం ఆమోదం
  • ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
  • ఈబీసీ నేస్తం అమలుకు ఆమోదం
  • అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
  • ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని నిర్ణయం
  • కిదాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
  • విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
  • వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనకు ఆమోదం