Asianet News TeluguAsianet News Telugu

నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఏపీఎంఈఆర్‌సీ ఏర్పాటు: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..!!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. 

ap cabinet key decisions ksp
Author
Amaravathi, First Published Dec 18, 2020, 2:47 PM IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. రైతు భరోసా పథకం, ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. 

ఏపీ కేబినెట్ నిర్ణయాలు

  • ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ (ఏపీఎంఈఆర్‌సీ) సంస్థకు కేబినెట్ ఆమోదం. దీని ఏర్పాటుకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయడం మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
  • కొత్త పర్యాటక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది
  • కరోనాతో దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదం
  • హోటళ్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు సాయం చేయనున్నారు.
  • రూ.198.05 కోట్ల పర్యాటక ప్రాజక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీ . దీని వల్ల రాష్ట్రంలోని 3,910 పర్యాటక సంస్థలకు ఆర్ధికంగా లబ్ధి కలగనుంది. 
  • ఒక్కో యూనిట్‌కు రూ.15 లక్షల వరకు రుణం, 6 నెలల మారటోరియం 
  • ఇన్‌పుట్ సబ్సిడీ ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా చెల్లింపులు. ఏ సీజన్ పరిహారం ఆ సీజన్‌లోనే చెల్లింపులు.
  • సమగ్ర భూ సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది
  • ప్రతి భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్. అలాగే ప్రతీ సరిహద్దుకి జియో ట్యాగింగ్
  • సమగ్ర భూ సర్వే వల్ల పేద, బలహీన రైతులకు రక్షణ. భూ ఆక్రమణలు జరగకుండా నిరోధిస్తుంది
  • సమగ్ర ల్యాండ్ రికార్డులు తయారు చేయడం ద్వారా రైతు హక్కులకు రక్షణ
  • పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
  • 27 మెడికల్ కాలేజీల ఏర్పాటు, అభివృద్ధికి రూ.16 వేల కోట్ల నిధులను మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ ద్వారా సేకరించాలని నిర్ణయం
  • తిరుపతిలో సర్వే ట్రైనింగ్ కాలేజీ ఏర్పాటుకు 40 ఎకరాలు
     
Follow Us:
Download App:
  • android
  • ios