Asianet News TeluguAsianet News Telugu

మద్యం అక్రమ రవాణా: ఏపీ బీజేపీ నేతపై హైకమాండ్ సీరియస్, సస్పెన్షన్

అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డ బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు  ప్రకటించింది

ap bjp suspends party leader ramanjaneyulu over illegally smuggling liquor
Author
Guntur, First Published Aug 16, 2020, 9:01 PM IST

అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టబడ్డ బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు  ప్రకటించింది.

ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కాగా 2019 ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తెలంగాణ నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా రామాంజనేయులు దొరికిపోయారు.

Also Read:తెలంగాణ నుండి ఏపీకి రూ. 6లక్షల మద్యం తరలింపు: బీజేపీ నేత అరెస్ట్

గుంటూరు ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో ఆయన రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌తో పట్టుబడ్డారు. రామాంజనేయులతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో అంజిబాబు వైన్లు, బార్లు కూడా నిర్వహించారు. మద్య నియంత్రణలో భాగంగా ఏపీ సర్కార్ 33 శాతం మద్యం దుకాణాలను మూసి వేయడంతో పాటు ధరలు పెంచడంతో కొందరు  సరిహద్దు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios