ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ పరిణామాలపై ఏపీ బీజేపీ స్పందించింది.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ గురువారం ప్రకటించారు. అయితే తాను ఎన్డీయేలో ఉన్నానని.. అందుకే ఈ విషయంపై తాను ఇన్నాళ్లు ఆలోచించానని చెప్పారు. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. బీజేపీతో కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఎన్డీయే కూటమిలో ఉన్న పవన్ కల్యాణ్.. ఆ కూటమిలో ప్రస్తుతం భాగస్వామ్యం లేని టీడీపీతో తమ పార్టీ పొత్తు ఉంటుందని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Also Read: టీడీపీ, జనసేన పొత్తు ఖరారు.. ప్యాకేజ్ బంధం బయటపడిందని పవన్ టార్గెట్‌గా వైసీపీ విమర్శలు..

పవన్ బీజేపీకి సమాచారం ఇచ్చే ప్రకటన చేశారా? లేక సొంతంగానే ప్రకటన చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ మాటలు చూస్తే.. బీజేపీకి సమాచారం ఇవ్వకుండానే ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనల పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఏపీ బీజేపీ స్పందించింది. పొత్తుల అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్న తెలిపింది. ప్రస్తుతానికి ఏపీలో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని పేర్కొంది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని తెలిపింది. పొత్తులను ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు నిర్ణయిస్తారని పేర్కొంది. 

Also Read: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి.. పవన్ ప్రకటన