Asianet News TeluguAsianet News Telugu

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి.. పవన్ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీలు కలిసి వెళ్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Janasena Chief Pawan kalyan says TDP and Janasena go for Ap elections combinedly ksm
Author
First Published Sep 14, 2023, 1:20 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీలు కలిసి వెళ్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే తాను ఎన్డీయేలో ఉన్నానని.. అందుకే ఈ విషయంపై తాను ఇన్నాళ్లు ఆలోచించానని చెప్పారు. అయితే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. వైసీపీ అరాచక పాలన అంతమొందించాలంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ సమిష్టిగా వెళ్లాలనేదే తన అభిప్రాయమని చెప్పారు. ఈ విషయాలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెబుతూనే వచ్చానని.. వారు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. 

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో ములాఖత్ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైందని చెప్పారు. వైసీపీ దౌర్జన్యాలను దోపిడిని, అరాచకాలను ఎదుర్కొవాలంటే.. విడివిడిగా పోటీ చేస్తే కుదరదని అన్నారు. ఇలా చేస్తే.. 20 ఏళ్లైనా ఈ అరాచకం కొనసాగుతూనే ఉందన్నారు.  తనను కూడా ఏపీలో అడ్డుగుపెట్టకుండా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే తాను ఈరోజు నిర్ణయం  తీసుకున్నానని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. ఈరోజు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇది తమ ఇద్దరి భవిష్యత్ గురించి కాదని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని తెలిపారు. 

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తాను చెప్పడానికి కారణం కూడా సీఎం జగనేనని పవన్ కల్యాణ్ అన్నారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటానని చెప్పిన జగన్.. తాను రాజకీయంగా లోకేష్, బాలకృష్ణను కలిసే అవకాశం ఉండకపోయేదని అన్నారు. అయితే ఈ పరిణామాలకు కారణం జగనేనని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వేళ్లన్ని జగన్ ఇంటివైపు చూపిస్తే.. ఒక్కరు జైలుకు వెళ్లలేదని అన్నారు. 

గుజరాత్‌లో హెరాయిన్ పట్టుకుంటే విజయవాడ మూలాలు తేలితే పోలీసులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అందరం పొలిటికల్ గేమ్ అడితే.. రాష్ట్రం అభివృద్ది చెందకుండా నాశనం అయిపోతుందని చెప్పారు. జనసేన నాయకులు నిరసన తెలిపేందుకు బయటకు వస్తేనే హత్యాయత్నం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అలాంటిది గతంలో అధికారంలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం పెద్ద కష్టమేమి కాదని అన్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. ఆ విషయం తమకు కూడా తెలుసునని అన్నారు. అయితే చంద్రబాబు రిమాండ్ రాజకీయ కక్షతోనే జరిగిందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. 

బిల్ క్లింటన్ లాంటి వ్యక్తులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. సైబరాబాద్‌కు రూపకల్పన చేసి వ్యక్తి ఈరోజు జైలులో ఉన్నారంటే నిజంగా బాధపడాల్సిన  అంశం  అని అన్నారు. 151 సీట్లు దౌర్జన్యం చేసే వ్యక్తికి ఇచ్చారని అన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యక్తి అని, క్రిమినల్ కాదని.. జగన్ ఆర్థిక నేరస్తుడని మండిపడ్డారు. కోనసీమకు తాను వస్తే 2 వేల క్రిమినల్స్‌ దించారని అన్నారు. కేంద్ర హోం శాఖ హెచ్చరిస్తే గానీ  వైసీపీ వెనక్కి తగ్గలేదని విమర్శించారు. వారాహి యాత్రలో గొడవలు చేస్తున్నట్టుగా, చంద్రబాబు చిత్తూరు పర్యటనలో గొడవలు చేసినట్టుగా చేస్తే.. హిట్లర్ నాజీ ఆర్మీని ఎలాగైతే యూదులు వెంటపడి చట్టసభలు తీసుకొచ్చారో వైసీపీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్క క్రిమినల్‌ను బయటకు తీసుకొస్తామని  చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనేదే తమ ఆకాంక్ష అని అన్నారు. వైసీపీ పాలనతో విసిగిపోయామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. స్వార్దం ఉన్నప్పటికీ ఆయనకు పట్టు విడుపు తెలుసునని అన్నారు. జగన్ చేసిన వ్యవహారం వైసీపీ వాళ్లకే డేంజర్ అని విమర్శించారు. జగన్ సొంత చెల్లిని, తల్లిని జగన్ దూరం పెట్టాడని.. బాబాయిని చంపిన వ్యక్తులను వెనకేసుకొస్తున్నాడని విమర్శించారు. అలాంటి వ్యక్తికి అధికారులు కొమ్ముకాస్తున్నారని.. తర్వాత ఆయన మద్దతుగా ఉంటారని  మీరేలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. జగన్ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఇదినట్టేనని.. అధికారులకు ఇదే విషయం చెప్పదలుచుకున్నానని తెలిపారు. 

ఒక్క మాజీ ముఖ్యమంత్రికే ఈ స్థితి వచ్చినప్పుడు.. అధికారులు వారి పరిస్థితి ఏమిటనేది ఆలోచించుకోవాలని అన్నారు. పోలీసులంటే తన గౌరవమని.. కానీ చట్టాన్ని, రాజ్యంగాన్ని ఉల్లంఘించి చేస్తుంటే తాను మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు. జగన్‌కు ఆరు నెలలు మాత్రమే సమయం ఉందని.. ఆయన మద్దతుదారులు ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవాలని కోరారు. అలాంటి వారికి యుద్దమే కావాలంటే.. యుద్దమే ఇస్తామని చెప్పారు. జగన్‌ను నమ్ముకున్న వైసీపీ నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని.. రేపటి  రోజున వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని.. ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ కలిసి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పారు. అదే జరుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ వద్ద తాను జగన్ గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని.. రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఆయనకు తెలియదా అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios