న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను కేంద్ర మంత్రికి వివరించినట్టుగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.సోమవారం నాడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలోని బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పెద్దద ఎత్తున నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరినట్టుగా సోము వీర్రాజు మీడియాకు తెలిపారు. బ్యాంకుల విలీనం తరహలోనే వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విలీనం చేయాలని కోరారు.

అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్టుగా సోము వీర్రాజు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికార, విపక్షాలన్నీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే