అమరావతి:  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు తన టీంను రెడీ చేసుకున్నారు. నూతన రాష్ట్ర పదాధికారులను ఆయన తాజాగా ప్రకటించారు. పదాధికారుల కార్యవర్గంలో చోటు దక్కించుకున్న నాయకులందరికి వీర్రాజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త కార్యవర్గం అంకితభావంతో పనిచేసి రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి అధికారం దిశగా నడిపించేలా పనిచేయాలని వీర్రాజు పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్ని బూత్ స్థాయి నుండి పటిష్ట పరిచే దిశగా పని చేయాలని సూచించారు. కార్యకర్తలందరిని కలుపుకుని అంకితభావంతో పనిచేయాలని వీర్రాజు సూచించారు. 

ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు జనరల్ సెక్రటరీలుగా జెడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం, ఎం. సుధాకర్ యాదవ్, స్పోక్స్ పర్సన్ గా చందు సాంబశివరావు ను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఉత్తర్వులు జారీ చేశారు. 

బిజెపి నూతన కార్యవర్గ జాబితా