సీఎం కొడుకు స్టాలిన్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్.. ‘సనాతన ధర్మాన్ని దోమతో పోల్చాడు’
తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ పై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని ఆయన దోమతో పోల్చాడని ఆగ్రహిస్తూ ఆయన వీడియోను షేర్ చేశారు.
హైదరాబాద్: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, తమిళనాడు యువజన, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొని ఉదయనిధి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఆ వీడియోలో ఉదయనిధి స్టాలిన్ తమిళంలో మాట్లాడుతున్నారు. ఆ వీడియోను ట్వీట్ చేసి అందులో ఉదయనిధి మాట్లాడినట్టగా చెబుతూ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఇంగ్లీష్‌లో వ్యాఖ్య జోడించారు.
Also Read: అక్కడి యువత పెళ్లి చేసుకోవడం లేదు.. జనాభా సంక్షోభం భయంతో ఆ దేశం ఏం చేసిందంటే?
‘ఈయన ఉదయనిధి స్టాలిన్. తమిళ నాడు సీఎం, ఇండియా కూటమి నేత ఎం కే స్టాలిన్ కొడుకు. ఆయన ఏమంటున్నారంటే.. ‘‘సనాతన ధర్మం అనేది దోమ, డెంగ్యూ, ఫ్లూ, మలేరియా వంటిది. దాన్ని వెంటనే నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది.’’ మొత్తంగా ఆయన చెప్పొచ్చేదేమంటే ఈ దేశంలోని 80 శాతం మందిని నిర్మూలించాలని పిలుపు ఇస్తున్నాడు. వీరితో కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నది. ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ పార్టీకి ఏం అభ్యంతరం ఉండదు. ఎందుకంటే వారు చెప్పే ప్రేమ దుకాణం అసలు రూపం ఇదే ఇదే గనుక.’ అని ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్టు చేశారు. ఈ పోస్టు పై నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.