రాష్ట్రంలో హిందూ దేవాలయాల నిధులను మింగేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ధార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. 

దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) . ఈ మేరకు శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం రూ.5 లక్షల లోపు ఆదాయం వున్న ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో చిన్న చిన్న దేవాలయాల నిధులను కూడా స్వాధీనం చేసుకోవాలని చూడటం దారుణమన్నారు. 

ఆయన ఏమన్నారంటే.. ‘‘ దేవాలయాల జోలికొస్తే ఖబడ్దార్. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఐదు లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలి. అలా చేయకుండా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిటట్లాడుతున్న చిన్నచిన్న దేవాలయాల నిధులు కూడా మింగేయాలి అనుకోవడం పరమ ధర్మార్గం’’.

‘‘ హిందూ దేవాలయాలు శక్తి కేంద్రాలు, భక్తి కేంద్రాలు, ముక్తి కేంద్రాలు వాటిని మూసివేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటే ఆ ప్రక్రియలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడం దేవాదాయ శాఖ భూములు, నిధులను కాజేసి ధార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తాం’’.

‘‘ ఈ హిందూ దేవాలయాల నిధులు కాజేసే ఘటన ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. ఏ దేవాలయాన్ని ముట్టుకున్నా తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుంది. మిగతా రాజకీయ పక్షాలు, సామాజిక వాదులు ఈ అంశంపై మీ యొక్క స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ’’ అని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. 

Also Read:వైసీపీ అంటే... ‘‘(Y ) వైఫల్యం (C ) చెందిన (P ) పార్టీ’’ : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

అంతకుముందు రాష్ట్రంలో అధ్వాన్నంగా వున్న రోడ్ల పరిస్ధితికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు సోము వీర్రాజు. శనివారం ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ జులై 15 సాయంత్రం కల్లా రోడ్లు మొత్తం రెడి అవుతాయి.జులై 20న ఫోటో గ్యాలరీ చేసి ప్రజలకు చూపిస్తాము. ఈ మాట గుర్తుందా? @ysjagan గారు!గుర్తుంటే "మాట తప్పం-మడమ తిప్పం" అనే మీ నినాదం ఏమైనట్టు? ప్రజలు మీ సమాధానం కోసమే ఎదురుచూస్తున్నారు. (Y ) వైఫల్యం (C ) చెందిన (P ) పార్టీ’’ అంటూ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Scroll to load tweet…