Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ల్యాండ్ స్కామ్.. టీడీపీ- వైసీపీ కుమ్మక్కు, సిట్ రిపోర్ట్ బయటకు రానిది అందుకే : సోము వీర్రాజు

విశాఖ భూ దందాల విషయంలో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. అందుకే సిట్ నివేదికలు బహిర్గతం కావడం లేదని ఆయన దుయ్యబట్టారు. 

ap bjp chief somu veerraju on vizag land scam
Author
First Published Oct 30, 2022, 5:14 PM IST

విశాఖ భూ దందాల విషయంలో టీడీపీ, వైసీపీ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితులతో రెండు పార్టీలు చేతులు కలపడం వల్లే సిట్ నివేదికలు బహిర్గతం కావడం లేదని వీర్రాజు వ్యాఖ్యానించారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు. దీనిపై విజయవాడలో పవన్‌ను కలిసి సంఘీభావం తెలిపామని.. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లామని సోము వీర్రాజు పేర్కొన్నారు. సరైన సమయంలో చర్యలు వుంటాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు. 

Also Read:విశాఖపట్నంలో భూభాగోతాలపై గవర్నర్‌కు లేఖ రాశాం.. బీజేపీ ఎంపీ జీవీఎల్

అంతకుముందు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... విశాఖపట్నంలో భూభాగోతాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఈ నెల 11న లేఖ రాసినట్టుగా తెలిపారు. 22ఏ కింద ఉన్న భూముల విషయమై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినట్టుగా చెప్పారు. ఆదివారం విశాఖపట్నంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహా రావు మీడియాతో మాట్లాడారు. జీవీఎల్ మాట్లాడుతూ.. బీజేపీ కారణంగానే 22ఏ భూముల వ్యవహారంలో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. విశాఖ భూముల వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపించారు. రెండు పార్టీలు కుమ్మకై సిట్ నివేదికను బహిర్గతం చేయలేదని విమర్శించారు. విశాఖ భూముల వ్యవహారంలో సిట్ నివేదికలను బయటపెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios