విజయవాడ: బిజెపి పార్టీ ఛలో అమలాపురానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడ నుండి అమలాపురానికి బయటుదేరిన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సెక్షన్ 30,144 అమల్లో ఉన్నందున ముందస్తు వీర్రాజును ముందస్తుగా నిర్బంధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

వీడియో

"

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై వీర్రాజు మండిపడ్డారు. దాడులకు గురైన ఆలయాల సందర్శనకు వెళ్లిన యువకులపై కేసులు పెట్టడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆగడాలను నిరసిస్తూ రేపు ఛలో అమలాపురం కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని వీర్రాజు స్పష్టం చేశారు.