కేంద్రం కంటే ఏపీ పరిస్ధితి బాగుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటరిచ్చారు. కేంద్రం కంటే రాష్ట్రం పరిస్ధితి బాగుంటే..రుణాల కోసం రోజూ ఎందుకు పరిగెడుతున్నారని ఆయన చురకలు వేశారు
అమరావతి (amaravati) రాజధానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (ys jagan) విమర్శలు గుప్పించారు బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) . ఉండవల్లిలో 'మనం - మన అమరావతి' పేరుతో (manam mana amaravati) బీజేపీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ... రాజధాని విషయంగా కేంద్రం ఎప్పుడూ మోసం చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసింది వైసీపీనే అని.. అమరావతిలో తక్షణం నిర్మాణాలను ప్రారంభించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. అలాగే రాజధానికి భూమలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల్లో ఏం చేస్తారనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతిలో అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య వ్యవస్థలను కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సోము వీర్రాజు చెప్పారు.
మరోవైపు కేంద్రం కంటే ఏపీ పరిస్ధితి బాగుందన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) వ్యాఖ్యాలపైనా వీర్రాజు స్పందించారు. కేంద్రం కంటే రాష్ట్రం పరిస్ధితి బాగుంటే..రుణాల కోసం రోజూ ఎందుకు పరిగెడుతున్నారని ఆయన చురకలు వేశారు. ఆర్ధిక పరిస్థితి బాగున్నప్పుడు రాజధానిని ఎందుకు కట్టడం లేదని వీర్రాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద వుండదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ నివేదికను కేంద్రానికి రాష్ట్రం ఇవ్వడం లేదని వీర్రాజు ఎద్దేవా చేశారు.
ALso Read:కేంద్రం కంటే ఏపీనే బెటర్.. అప్పుల చిట్టా విప్పిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
అంతకుముందు గురువారం విజయసాయిరెడ్డి న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. జగన్ (ys jagan) సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఏపీ ఆర్ధిక స్థితిపై (ap financial status) కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం కంటే ఏపీ ఆర్ధిక పరిస్థితే మెరుగ్గా వుందన్న ఆయన 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా వుందని.. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో వుందని తెలిపారు. ఎక్స్‌పోర్ట్స్ విషయంలోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించిందని... కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. 41 శాతం వాటా ఇస్తున్నామన్న కేంద్రం మాటల్లో వాస్తవం లేదని.. సెస్, సర్ ఛార్జీలను కేంద్రం ఏటా పెంచుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ ఆ ఆదాయం మాత్రం ఇవ్వడం లేదని... రాష్ట్రాల అప్పులపై గురించి కాదని, ముందు తన అప్పుల సంగతి ఏం చెబుతారని ఆయన చురకలు వేశారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే... చంద్రబాబు సీఎంగా వుండగా ఏపీలో 117 శాతం అప్పుటు పెరిగాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయని ఆయన పేర్కొన్నారు. బాబు ప్రభుత్వం ఐదుగురు కోసం పనిచేస్తే.. జగన్ ప్రభుత్వం 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
