తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి తాము వ్యతిరేకం కాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన భాషా... సాంస్కృతి ని కాపాడాలని సూచించారు. భాషని బలవంతంగా రుద్ద వద్దని.. ప్రభుత్వ పరంగా తెలుగు ని విస్మరిస్తాము అంటే కుదరదని, ఆప్షన్ విధానం పెట్టాలని కన్నా స్పష్టం చేశారు.

ఇంగ్లీషు బాషా అమలు వెనుక మతపరమైన కుట్ర ఉందని.. అమ్మ కి మమ్మి కి మధ్య ఉన్న తేడా తో మొత్తం సంస్కృతి మారిపోతుందని లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మతాన్ని ప్రోత్సాహించేందుకు ప్రయత్నం చేస్తుంటే ఉరుకొమని.. ఎవరు ప్రజా సమస్యలపై పోరాడిన సంఘీభావం ఉంటుందని కన్నా స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ తీసుకొన్న నిర్ణయాలపై వస్తున్న విమర్శలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.

Also Read:'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

తనపై విమర్శలు చేసిన వారి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడు పిల్లలు, మనమలు ఏ స్కూల్లో చదవించారో చెప్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోరారు.

ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివించాల్సిన అవసరం ఉందన్నారు.పేద పిల్లలకు ఇంగ్లీష్ చదివించడం ఇష్టం లేనట్టుగా  కొందరు నేతలు మాట్లాడుతున్నారని సీఎం వైఎస్ జగన్విమర్శించారు. చంద్రబాబునాయుడు తన కొడుకును మనమడిని ఏ స్కూల్లో చదివించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురో లేదా ఐదుగురో పిల్లలు ఉన్నారు. వీరంతా ఏ  మీడియం స్కూల్లో చదువుతున్నారో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన పిల్లలు లేదా మనమళ్లను ఏ మీడియం స్కూల్లో చదవిస్తున్నారని జగన్ ప్రశ్నించారు.

పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దేశమంతటా నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు.

2008లో దివంగత నేత వైఎస్ఆర్ మైనారిటీ వెల్ఫేర్ గా ప్రకటించి జాతీయవిద్యా దినోత్సవ ఉత్సవాలు, మైనారిటీ ఉత్సవాలను ఒకే రోజు జరుపుకుంటామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

Also read:జగన్... కేసీఆర్ ని చూసి నేర్చుకో... ట్విట్టర్ లో పవన్

ఒక దీపానికి వెలుగునిస్తే కుటుంబం మొత్తానికి వెలుగునిస్తుందని సీఎం జగన్ చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు చదివితే ఆ కుటుంబం బాగుపడతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 

2011 జనభా లెక్కల ప్రకారం ఏపీలో చదువురాని వారి సంఖ్య 33%, దేశంలో‌ చూస్తే 27%గా ఉందని సీఎం తెలిపారు. అందరూ కూడ చదువుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. 

ప్రపంచంలో పోటీతత్వం బాగా పెరిగిందన్నారు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా వచ్చుండాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.