Asianet News TeluguAsianet News Telugu

జగన్... కేసీఆర్ ని చూసి నేర్చుకో... ట్విట్టర్ లో పవన్

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్త్తూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయిస్తే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు భాష విలువేంటో వైసీపీ నాయకత్వానికి తెలిస్తే ఇంత అర్థరహితమైన నిర్ణయం తీసుకోదన్నారు.

janasena chief pawan kalyan advice to CM Jagan over Telugu language
Author
Hyderabad, First Published Nov 11, 2019, 7:31 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్, ఆయన పార్టీ నేతలంతా... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాష, సంస్కృతిని ఎలా కాపాడాలో కేసీఆర్ బాగా తెలుసు అని... ఆయనను చూసి జగన్ కూడా నేర్చుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్త్తూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయిస్తే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు భాష విలువేంటో వైసీపీ నాయకత్వానికి తెలిస్తే ఇంత అర్థరహితమైన నిర్ణయం తీసుకోదన్నారు. ఈ నిర్ణయం చూశాక తన గ్రంథాలయంలోని తెలుగు పుస్తకాలను ప్రేమాభిమానాలతో ఒకసారి చూసుకున్నానని చెప్పారు. 

 

పెదబాలశిక్ష, తెలుగు వ్యాకరణం, శ్రీ సూర్యరాయేంద్ర నిఘంటువు, దేవరకొండ బాలగంగాధరతిలక్‌ సాహిత్యం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆంధ్రుల సాంఘిక జీవితచరిత్ర, శివారెడ్డి కవిత, 2017లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ రూపొందించిన ‘తొలిపొద్దు’ పుస్తకాన్ని పవన్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios