ఏపీలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు.. సీబీఐ విచారణ చేయించండి : అమిత్ షాను కోరిన పురందేశ్వరి
ఏపీలో మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. క్యాష్ అండ్ క్యారీతో భారీ అవినీతి జరుగుతోందని.. ముఖ్యంగా చీప్ లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని పురందేశ్వరి పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను ఆమె వివరించారు. ఏపీలో మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా అమిత్ షాను పురందేశ్వరి కోరారు. క్యాష్ అండ్ క్యారీతో భారీ అవినీతి జరుగుతోందని.. ముఖ్యంగా చీప్ లిక్కర్ అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు అమిత్ షాకు ఆమె వినతిపత్రం అందజేశారు.