Asianet News TeluguAsianet News Telugu

అక్కడ నుంచి వచ్చి జగన్ సీఎం అయ్యాడు.. కానీ లోకేశ్ ఏమయ్యాడు?: అంబటి

అమెరికా నుంచి తిరుగుటపాలా వచ్చేసిన జగన్ తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడి ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడుకు 70 ఏళ్లు దాటాయని ఆయన హుందాగా నడుచుకోవాలని అంబటి రాంబాబు సూచించారు. 

ap assembly winter sessions: Ysrcp mla Ambati rambabu fires on former cm Chandrababu
Author
Amaravati Capital, First Published Dec 10, 2019, 5:51 PM IST

అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి చంద్రబాబును గమనిస్తే ఏదో తేడా కొట్టినట్లు ఉందన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

సీఎం జగన్ ను చూసి చంద్రబాబు లే లే అంటూ మాట్లాడుతుంటే మాజీమంత్రి అచ్చెన్నాయుడు తమను బెదిరించేలా వ్యవహరిస్తున్నారంటూ అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అన్నట్లు ఆయన 25 సంవత్సరాల యువకుడిలా ప్రవర్తిస్తుంటే ఆయన తనయుడు నారా లోకేష్ 70 ఏళ్ల వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడా అంటూ సెటైర్లు వేశారు. 

చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్ పై విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అసత్యాలను చాలా సులభంగా కప్పిపుచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో తమకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు అంబటి రాంబాబు. మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. మాట్లాడితే అచ్చెన్నాయుడు ఇతర చెవుల్లో దూరుతారంటూ మండిపడ్డారు. 

జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లారని, తనను జైలుకు తీసుకెళ్తారనే భయంతో వరుణ దేవుడు భయపడుతున్నారంటూ వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. కేసుల విచారణ ఎదుర్కొంటే నేరస్థుడు అయిపోతే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరుగుతుందని అయితే ఆయన నేరస్థుడా అంటూ ప్రశ్నించారు. 

ఎర్రగడ్డ నుంచి లొల్లి చేసేందుకు వచ్చారు: చంద్రబాబును వీధి రౌడీ అన్న రోజా

తమకు హెరిటేజ్ కు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు అనడంపై మండిపడ్డారు. హెరిటేజ్ చంద్రబాబు నాయుడు కంపెనీయేనని అయితే దాన్ని అమ్ముకుని షేర్లు పెట్టుకున్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. హెరిటేజ్ కు లాభం చేకూరేలా చంద్రబాబు గత ప్రభుత్వంలో కోటానుకోట్ల నిధులు కేటాయించలేదా అని నిలదీశారు. 

హెరిటేజ్ తమది కాదని పదేపదే చెప్పుకున్నా, కళ్లు ఉరిమి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. రైతు రుణమాఫీ చేశానని, వ్యవసాయం కోసం తనఖాపెట్టిన రుణాలను సైతం రద్దు చేశామని చెప్తున్న చంద్రబాబు అది నిజమైతే 23 సీట్లకే ఎందుకు పరిమితమవుతారని నిలదీశారు. 

రైతులు ఎందుకు చంద్రబాబుకు ఓటెయ్యలేదని నిలదీశారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేయించిన టీడీపీ ఎన్ని ఉద్యోగాలు తీశారని నిలదీశారు. బాబు పోతే ఉద్యోగం వస్తుంది అన్న చందంగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. 

అసత్యాలు చెప్పడంలో ఈ దేశంలోనే నెంబర్ వన్ దిట్ట చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. అసత్యాలు ఎన్ని చెప్పినా ఆయనకు అలసట రాదన్నారు. ఎన్ని సత్యాలు చెప్పినా నవ్వుతూనే ఉంటారన్నారు. రైతు రుణమాఫీ పూర్తి చేశామని దాన్ని చూసి ఓర్వలేకే చంద్రబాబు అసత్యాలు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. 

అసెంబ్లీలో గురుశిష్యుల వార్: జగన్ ను చూసి దేవుడు సైతం భయపడుతున్నారన్న బాబు

అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఫ్యూచర్ కంపెనీకి హెరిటేజ్ అమ్మేశామని దానిపై కూడా వివాదం చేయడం దారుణమన్నారు. తన తనయుడు నారా లోకేష్ విదేశాల్లో విద్యనభ్యసించాడని గర్వంగా చెప్తానని తెలిపారు.

నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడే చెప్పానని తన తనయుడు విదేశాల్లో చదువుతుంటే మీ వాడు తిరుగు తపాలా వచ్చేశాడని విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. 

తన తనయుడు టంగ్ స్లిప్ అయితే అవమానిస్తున్నారని అది భావ్యం కాదన్నారు. తెలంగాణలో దిశ అనే అమ్మాయి ఘటన గురించి చెప్తున్నప్పుడు స్కూటర్ కు టోల్ కట్టి అని జగన్ అన్నారని తాను దానికి ఏమైనా అన్నామా అని సెటైర్లు వేశామా అంటూ చంద్రబాబు నిలదీశారు. 

జగన్! ముందుంది ముసళ్లపండగ, మీ కథ చూస్తాం: చంద్రబాబు ఫైర్.

తమను నిందించేందుకు ప్రయత్నిస్తే తాము నిందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మా ఇంటికి ఎంత దూరమో మీ ఇంటికి అంతే దూరమని స్పష్టం చేశారు. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే మంచిదని లేకపోతే తాను కూడా అలాగే ప్రవర్తించాల్సి హెచ్చరించారు. 

4లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అనంతపురంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కియా మోటార్స్ ను తానే తీసుకువచ్చినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 

రైతులకు న్యాయం చేయాలని గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు భరోసా విషయంలో మాట తప్పమన్నారని దాన్ని నిరూపించుకోవాలని సూచించారు చంద్రబాబు. అమెరికా నుంచి జగన్మోహన్ రెడ్డి తిరుగుటపాలా వచ్చేశారంటూ ఆరోపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు జగన్ ఏం చేశారని నిలదీశారు. అమెరికా నుంచి తిరుగుటపాలా వచ్చేసిన జగన్ తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడి ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

చంద్రబాబు నాయుడుకు 70 ఏళ్లు దాటాయని ఆయన హుందాగా నడుచుకోవాలని అంబటి రాంబాబు సూచించారు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమంటూ చంద్రబాబు సవాల్ విసురుతున్నారని ఇదేమైనా ఫైటింగా అంటూ నిలదీశారు. 

చంద్రబాబు నాయుడు ఒక బాహుబలిలా ఫీలవుతున్నారంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు. టీడీపీని ఎదుర్కొన్నాం కాబట్టి ఈరోజు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు.

ఏదో అనుభవం ఉన్నట్లు మీ అందరినీ ఎదుర్కొంటామని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఇదేదో బాహుబలిలా ఫీలవుతున్నారని అంబటి మండిపడ్డారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు హుందాగా నడుచుకోవాలని సూచించారు అంబటి రాంబాబు. 

 పిచ్చాస్పత్రిలో చేర్చినా మీరు మారరు: టీడీపీపై జగన్ ధ్వజం..

Follow Us:
Download App:
  • android
  • ios