అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అన్నీ తప్పులు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడుకు 70ఏళ్లు రావడంతో కాస్త మతిమరపు వచ్చినట్లు ఉందన్నారు. 

ఇకపోతే చంద్రబాబు సమకాలికుడు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు 40 ఏళ్ళ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇవ్వాల్సింది పోయి తిడతారా అంటూ విమర్శించారు.  ధాన్యం కొనుగోలు అంశానికి సంబంంధించి అన్ని అంశాలపై పేపర్లలో యాడ్ ఇస్తానని జగన్ చెప్తే దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు కొడాలి నాని. 

జగన్ కు చెందిన సాక్షిపేపన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సాక్షి పేపర్ ను ప్రజలు నమ్మరని చంద్రబాబు అనడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడులా దొంగ హెరిటేజ్ కంపెనీ సాక్షి పేపర్ కాదన్నారు. 

అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్

చంద్రబాబు నాయుడు దొంగ రైతు అంటూ విరుచుకుపడ్డారు. రైతులను మోసం చేసి తక్కువ రేటుకు కూరగాయలు, పంటలు కొనుగోలు చేసి వాటిని హెరిటేజ్ లో అమ్ముకుని కోటాను కోట్లకు పడగలెత్తిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

అలాంటి దొంగ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుతో చెప్పించుకునే ఖర్మ తమకు పట్టలేదన్నారు మంత్రి కొడాలి నాని. మాకు ఆదర్శంగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు మాతో తిట్లు తినడం దురదృష్టకరమన్నారు.  

కొడాలి నాని వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక్కడిని మాట్లాడితే 10 మంది మంత్రులు మూకుమ్మడి దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు తాను ఒక్కడినే సమాధానం చెప్తానని హెచ్చరించారు. 

నా వయస్సు గురించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారని తనకు వయసు అయిపోతుందన్న బెంగ లేదన్నారు. తన వయస్సు ఎంత ఉన్నా 25 సంవత్సరాల వయస్సులో ఉన్న యువకుడికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తనకు అలాంటి ఆలోచనలే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. 

చంద్రబాబుపై రోశయ్య డైలాగ్ వదిలిన బుగ్గన: నాకు తెలివి ఉంటే కత్తి తీసుకుని..

అసెంబ్లీలో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి దాడికి దిగుతున్నారని ఆరోపించారు. 50కాదు 151 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి దాడి చేసినా నిలబడి తట్టుకునే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 

ఆహా...కాదు ఓహో హో కాదు అన్నింటికి సమాధానం చెప్తామని కంగారు పడొద్దని అధికార పార్టీని హెచ్చరించారు. సవాల్ విసురుతున్నా 151 మందికి తానే సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. వైసీపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని వాటికి తాను తలగ్గే పరిస్థితి లేదని, వెనకడుగు వేయన్నారు. 

మైండ్ గేమ్ ఆడటంలో జగన్ ఎక్స్ పెర్ట్ అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఎవరితో మైండ్ ఆడతారంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వర్షాలు పడవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తానొస్తే వర్షాలు పడవన్నమాట పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వర్షాలు పడవన్నారు. వరుణ దేవుడిని కూడా జైలుకు తీసుకువెళ్తారన్న భయంతో వర్షాలు కురవవని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేవుడిని కూడా జైలుకు తీసుకుపోతారనే భయంతో వర్షాలు కూడా రావడం లేదన్నారు. 

జగన్! ముందుంది ముసళ్లపండగ, మీ కథ చూస్తాం: చంద్రబాబు ఫైర్