అరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తనను తెలివైన వారని చంద్రబాబు అంటున్నారని గతంలో కూడా ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి రోశయ్యను కూడా ఇలాగే అనేవారని గుర్తు చేశారు. 

ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్యను మీరు తెలివైన వారు అంటే ఆయన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకు వచ్చిందని ఆ డైలాగ్ ని సభలో వినిపించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నేను తెలివైన వాడిని అయితే కత్తి తీసుకుని ఎవరూ చూడనప్పుడు వెనుక నుండి వచ్చి కసకస పొడిచేసేవాడినని అది లేదు కాబట్టే గుమస్తా ఉద్యోగం చేస్తున్నానని రోశయ్య అంటూ ఉండేవారని బుగ్గన గుర్తు చేశారు. బుగ్గన చెప్పిన డైలాగ్ తో సభలోని సభ్యులంతా నవ్వారు. దాంతో సభలో ఒక్కసారిగా నవ్వులు వెలిశాయి. 

అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్...

అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఎంతమందికి డబ్బులు ఇచ్చాం అనేదానిపై వివరణ ఇచ్చారు. దాంతో చంద్రబాబు మంత్రి బుగ్గనపై సెటైర్లు వేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చాలా తెలివైన వారని అనుకుంటున్నారని విమర్శించారు. 

అది నీ జాగీరు కాదు, గుడివాడలో నేనున్నా జాగ్రత్త: చంద్రబాబుకు కొడాలి నాని వార్నింగ్...

సభలో తాను ఏం చెప్పినా చెల్లుతుందని ఆయన భావిస్తున్నారని అందరి చెవుల్లో పువ్వులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రజలంతా కలిసి మీ చెవుల్లో పువ్వులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకండి అంటూ సెటైర్లు వేశారు. 

తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతీ అంశం అంకెలతో సహా డాక్యుమెంట్ ఇస్తున్నానని దానిపై ఎప్పుడు చంద్రబాబు అభ్యంతరం తెలపలేదన్నారు. ప్రతీ ఒక్కటీ అంకెలతో సహా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

హెరిటేజ్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ కంపెనీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు లక్షల షేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఫ్యూచర్ కంపెనీలో 3.55 శాతం వాటాలు ఉన్నవి నిజం కాదా అని నిలదీశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 

  శవం దొరికితే వదలరా, నీకు ఆత్మసాక్షి లేదా: చంద్రబాబుపై జగన్ ఫైర్