అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా రెండోరోజు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో నారా లోకేశ్‌ తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పంటకు గిట్టుబాటు ధరతో పాటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

వరికంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రంలో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉందని ఆరోపించారు. అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్న చందంగా రైతుల పరిస్థితి నెలకొందన్నారు.  

జగన్ కు కౌంటర్: హెరిటేజ్ గ్రూప్ తో మాకు సంబంధం లేదన్న నారా భువనేశ్వరి

ఆరుకాలం రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం ఒకటైతే రైతు పంట కొనే నాథులు లేరంటూ విరుచుకుపడ్డారు. పంటదిగుబడి తగ్గినా ఎవ్వరు కొనేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. 

వేరుశనగ, పామాయిల్, శనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు టీడీఎల్పీ ఉపపనేత అచ్చెన్నాయుడు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి అటు రైతులను ఇటు ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు.  

రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేవరకు పోరాటం  కొనసాగుతుందని స్పష్టం చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. 

Ap Assembly: అసెంబ్లీలో స్పీకర్ తో చంద్రబాబు వాగ్వాదం... టీడీపీ నేతల వాకౌట్