Asianet News TeluguAsianet News Telugu

నేను జైల్లో చిప్పకూడు తినలేదు: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

వైసీసీ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సీఎం వైయస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు శాంతించారు. 

AP Assembly: Tdp mla Nimmala Ramanaidu controversy comments on CM YS Jagan
Author
Amaravati Capital, First Published Dec 13, 2019, 5:11 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. తాను జైల్లో చిప్పకూడు తినలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గురువారం అసెంబ్లీ నాలుగవ గేటు వద్ద జరిగిన ఘటనపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. చర్చల్లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఘటనను వివరించే ప్రయత్నం చేశారు. 

14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును 40 నిమిషాల పాటు అసెంబ్లీకి రాకుండా చీఫ్ మార్షల్స్ అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామానాయుడు. గేట్లు వేసి చంంద్రబాబు చేతులు పట్టుకుని నలిపేశారంటూ ఆరోపించారు. 

తాము కలెక్టరేట్ దగ్గర ధర్నాకు బయలు దేరడం లేదని తాము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం కోసం చర్చకు అసెంబ్లీకి వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీకి వస్తే చీఫ్ మార్షల్స్ అడ్డుకోవడం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలని నిలదీశారు. 

కొడాలి నానికి మెంటల్, నీ సంగతి తొందర్లో తేలుతోంది: అచ్చెన్న...

అయితే అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఫోటోలను గ్రాఫిక్స్ చేసి,ఎడిట్ చేసి చూపిస్తున్నారంటూ మంత్రి పేర్ని నానిపై ఆరోపించారు. తనను డ్రామా నాయుడు అంటూ పేర్నినాని అనడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు రామానాయుడు. 

తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. 16 నెలలు జైల్లో లేనని చెప్పుకొచ్చారు. 16 నెలలపాటు జైల్లో చిప్పకూడు తినలేదంటూ పదేపదే గుర్తు చేశారు. అలాగే తాను ఏ చార్జిషీట్ లోనూ నెంబర్ వన్ ముద్దాయిగా లేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రామానాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడుకు అడ్డుతగిలారు. జగన్ జైల్లో ఉన్నారన్న విషయం రామానాయుడు చెప్తేనే ప్రజలకు తెలియంది కాదన్నారు. 

నిన్ను పశువుల ఆస్పత్రిలో మీ బాస్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: టీడీపీపై కొడాలి నాని...

జగన్ పై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెట్టించి అక్రమంగా జైల్లో పెట్టిందన్న విషయం అందిరికీ తెలిసిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఒక పార్టీని పెట్టి ఒక వ్యవస్థను సృష్టించిన వ్యక్తి వైయస్ జగన్ అని చెప్పుకొచ్చారు. 

జగన్ ను అక్రమంగా జైల్లో పెట్టారన్న విషయం ప్రజలకు తెలుసునని తెలిసిన తర్వాత ప్రతిపక్ష నాయుకుడు హోదా ఇచ్చారని ఇప్పుడు 151 సీట్లతో అఖండ విజయాన్ని అందించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారంటూ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సీఎం వైయస్ జగన్ పై చేసిన వ్యాఖ్యల పట్ల వైసీసీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. దాంతో  రంగంలోకి దిగిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది. 

నేను సర్వీసులో ఉంటే నీలాంటోడికి పాఠాలు చెప్పేటోడ్ని: అచ్చెన్నకు వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్.

Follow Us:
Download App:
  • android
  • ios