అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం, చంద్రబాబు మధ్య మంగళవారం నాడు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.

టిడ్కో ఇళ్ల విషయంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఇవాళ ఉదయం నుండి ఈ విషయమై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.ఈ విషయమై  టీడీపీ సభ్యులు పదే పదే సభను అడ్డుకోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. 

స్పీకర్ తమ్మినేని సీతారాం , చంద్రబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. నన్ను బెదిరిస్తారా .. నీ బెదిరింపులకు ఎవరు భయపడరని చంద్రబాబును ఉద్దేశించి  స్పీకర్ వ్యాఖ్యానించారు.

నీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పీకర్  చంద్రబాబు చెప్పారు. మాట్లాడే పద్దతిని నేర్చుకోవాలని స్పీకర్ తమ్మినేని చంద్రబాబుకు హితవు పలికారు.టీడీపీ సభ్యుల తీరుపై  స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నాయకుడు అయితే ఏమిటని స్పీకర్ ప్రశ్నించారు. నిలబడి వార్నింగ్ ఇస్తారా అని టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నీ ఉడుత ఊపులకు.. పిల్లి శాపనార్ధాలకు భయపడనని చెప్పారు.  జాగ్రత్తగా ఉండాలన్నారు. మాట్లాడే పద్దతిని నేర్చుకోవాలని స్పీకర్ చంద్రబాబుకు హితవు పలికారు.స్పీకర్ పట్ల అనుచితంగా మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ  సభ్యులు డిమాండ్ చేశారు.