అమరావతి:రెండో రోజున  ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి.   సమావేశం ప్రారంభం కాగానే  టీడీపీ ఎమ్మెల్యేలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.   టీడీపీ సభ్యులు  సభలో నినాదాలు చేయ డంపై స్పీకర్   తమ్మినేని సీతారాం  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అరెస్ట్: రిమాండ్‌కు తరలింపు

 ఏ)పీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు  ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యే కోట రామారావు  మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సీ బిల్లును ప్రవేశపెట్టింది. 

 శాసనసభలో  ఎస్సీ కమిషన్‌  బిల్లును మంత్రి విశ్వరూప్ ప్రవేశపెట్టారు.  ఈ బిల్లును టీడీపీ సభ్యులు నినాదాల  మధ్య ప్రవేశపెట్టారు మంత్రి విశ్వరూప్. ఈ బిల్లుపై వైసీపీ వరప్రసాద్ చర్చను ప్రారంభించారు.అయితే టీడీపీ సభ్యులను తన ప్రసంగానికి అడ్డు తగలకుండా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమయంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం జోక్యం చేసుకొన్నారు. సోమవారం నాడు  అసెంబ్లీలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బినామీ పేర్లపై అమరావతి ప్రాంతంలో భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.

మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి సతీమణి ఝాన్సీరాణి పేరు మీద   ఈ భూములు ఉన్నాయని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.ఈ విషయమై విచారణ చేస్తున్నామని ఏపీ రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఈ సందర్భంగా చెప్పారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయని మంత్రి చెప్పారు. ఇదే  సమయంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.