కోర్టులపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిదానికి స్టేలు ఇచ్చుకుంటూ పోతే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమించే పరిస్థితి వస్తుందన్నారు.

పేదలకు ఇచ్చే 30 లక్షల పట్టాలు అడ్డుకుంటే వారు ఊరుకుంటారా అని సీతారామ్ ప్రశ్నించారు. సీఎం జగన్ మౌనంగా వుంటున్నారని.. కానీ ఏదో ఒక ఆయన మౌనం బద్దలయితే ప్రళయం వస్తుందని స్పీకర్ అన్నారు.

Also Read:చట్ట సభల్లో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే వీల్లేదు: స్పీకర్ తమ్మినేని

అలాంటి పరిస్ధితి తెచ్చుకోవద్దని తమ్మినేని వ్యాఖ్యానించారు.అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారని తమ్మినేని సీతారామ్ జోస్యం చెప్పారు. 

ఆయన కోర్టు తీర్పులను విమర్శించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు పార్లమెంట్, శాసనసభలలో తీసుకొన్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించేందుకు వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం కూడ తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.