అమరావతి: చంద్రబాబునాయుడు రోజు రోజుకి దిగజారి ప్రవర్తిస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు.

చంద్రబాబునాయుడు వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి దుష్టశక్తులను ప్రజలు గమనించాలని ఆయన చెప్పారు.