Asianet News TeluguAsianet News Telugu

బీసీలు దద్దమ్మలు కాదు: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

బీసీలంటే దద్దమ్మలు కాదని  బీసీ అంటే బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ద సొసైటీ అని అన్నారు. బీసీల గొప్పతనాన్ని తెలియజేసేందుకే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
 

ap assembly speaker tammineni seetaram participated valmiki jayanthi celebrations
Author
Srikakulam, First Published Oct 13, 2019, 4:00 PM IST

 శ్రీకాకుళం : బీసీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. బీసీలంటే దద్దమ్మలు కాదని  బీసీ అంటే బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ద సొసైటీ అని అన్నారు. బీసీల గొప్పతనాన్ని తెలియజేసేందుకే మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లాలో వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్‌ వేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పుకొచ్చారు. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను రచించింది మహర్షి వాల్మీకి అని గుర్తు చేశారు. 

రామాయణ సామాజిక నీతిని బోధిస్తుందని, భారతం లౌక్యం నేర్పిస్తుందని చెప్పకొచ్చారు. దేశానికి ఎంతో గొప్ప చరిత్రను అందించిన వ్యక్తి వాల్మీకి మహర్షి అని అన్నారు. ఒక బోయవాడు పరిణితి చెంది అద్భుతమైన రామాయణ కావ్యం రాశారని గుర్తు చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. బీసీల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నో పథకాలను అందించారని, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత పాధాన్యత ఇచ్చిందని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios