అమరావతి: ఏపీ బడ్జెట్‌కు ఏపీ అసెంబ్లీ గురువారం నాడు ఆమోదం తెలిపింది.  రూ. 2,29,779 కోట్లతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించాడు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం రూ 1,82,196 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 47,582 కోట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ లోటును రూ. 5 వేల కోట్లుగా తేల్చి చెప్పింది.జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు రూ.3.49 శాతంగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.

also read:అన్నీ సక్రమంగా జరిగితే నా వల్లే, జరగకపోతే ఎదుటివాళ్లదే తప్పు: చంద్రబాబుపై జగన్

 ఇక ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు ప్రతిపాదించారు.తొలిసారిగా జెండర్ బేస్డ్  బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించింది.రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్  తీసుకొచ్చింది. శాసనమండలిలో బడ్జెట్ ను ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు.ఇదిలా ఉంటే  ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది.