అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బీఏసీ సమావేశంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్,  టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 

ఏపీ అసెంబ్లీ ఎన్ని రోజులు జరగాలనే విషయమై బీఏసీ సమావేశంలో చర్చించారు. సోమవారం నాడు ఉదయం బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో  ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. టీడీపీ తరపున టీడీపీ శాసనససభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

Alsoread:పార్టీ మార్పుపై తేల్చేసిన గొట్టిపాటి

గత నెల 29వ తేదీ రాత్రి విశాఖపట్టణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు.  ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు కారు తీవ్రంగా దెబ్బతింది. అచ్చెన్నాయుడు స్వల్ప గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే.

బీఏసీ సమావేశానికి హాజరైన టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు చేతిని చూసిన సీఎం జగన్  గాయం తగ్గిందా అని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందని  ఆయన ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును అచ్చెన్నాయుడు సీఎం జగన్‌కు వివరించారు.

Also read:అసెంబ్లీలో హోదా రగడ: చిటికెలు వేసిన అచ్చెన్న, నాలుక మడతపెట్టొద్దన్న మంత్రి కన్నబాబు

ప్రమాదంపై  మా సీఎం మీ గురించి ఎంత ప్రేమగా ఆడిగారో చూడండి అంటూ  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడ‌ుకు చెప్పారు. అయితే ఈ విషయమై అచ్చెన్నాయుడు కూడ సమాధానమిచ్చారు.

తనకు, జగన్‌కు వ్యక్తిగతంగా ఏముంటుందని టీడీపీ శాసనససభపక్ష ఉపనాయకుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.  మాది వేరే పార్టీ మీది వేరే పార్టీ అనే దూరం మినహా కోపం ఏముంటుందని అచ్చెన్నాయుడు చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ఆయన బీఏసీ సమావేశంలో కోరారు. అయితే ప్రభుత్వం వారం రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తే  సరిపోతోందని  ప్రభుత్వం అంటోందని అచ్చెన్నాయుడు బీఏసీ సమావేశంలో చెప్పారు.