Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు. 

AP Assembly Deputy Speaker Kona Raghupathi Resigns
Author
First Published Sep 15, 2022, 4:08 PM IST


అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు.ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు  కొత్త  డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల మంత్రివర్గ విస్తరణను చేశారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాల నేపథ్యంలో నామినేటేడ్ పదవుల్లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామాను సమర్పించారు. దీంతో ఈ స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఈ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తుందనే ప్రచారం సాగుతుంది. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొంటారు.  ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ గా మల్లాది విష్ణును ప్రభుత్వం నియమించింది. బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన విష్ణుకు నామినేటేడ్ పదవిని కేటాయించింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తప్పించాలని నిర్ణయం తీసుకొందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

ఆర్యవైశ్య సామాజికవర్గానికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని వైసీపీ నాయకత్వం భావిస్తుందనే చర్చ సాగుతుంది. ఈ సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి ఈ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios