అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ జూలై 11 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి జూలై 12న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాలే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుందని తెలుస్తోంది. 

బడ్జెట్ రూపకల్పనలో భాగంగా జూలై 1,2 తేదీలలో అన్ని శాఖల మంత్రులతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి.