ఈ నెల 27వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు: రేపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ, బీఏసీకి టీడీపీ దూరం
ఈ నెల 27వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకుంది. గురువారంనాడు ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ సభ్యులు హాజరు కాలేదు. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీంతోనే టీడీపీ సభ్యులు ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది.
బీఏసీ సమావేశానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,చీఫ్ విప్ ప్రసాదరాజు తదితరులు హాజరయ్యారు.ఈ నెల 23, 24 తేదీల్లో ఏపీ అసెంబ్లీకి సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22న ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు పై చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజూ రెండు అంశాలపై చర్చించాలని బీఏసీ డిసైడ్ చేసింది. సుమారు ఎనిమిది అంశాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది.