Asianet News TeluguAsianet News Telugu

జగన్ తీరుతో వారు ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారు: మాజీమంత్రి అచ్చెన్నాయుడు

కేంద్రం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టించారా అంటూ నిలదీశారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లను, సర్పంచ్ లను ఇబ్బంది పెట్టాలనో తెలియదు గానీ వారికి బిల్లులు చెల్లించడం లేదని వాపోతున్నారని తెలిపారు. 
 

AP Assembly: Former minister atchannaidu comments on NREGS funds
Author
Amaravati Capital, First Published Dec 17, 2019, 11:05 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పరిపాలన అందించారని చెప్పుకొచ్చారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు. గత ఐదేళ్లు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు వేయించారని చెప్పుకొచ్చారు. 

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనేక విభాగాలకు అనుసంధానం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,5000 కిలోమీటర్ల మేర 26,000 మీటర్లు సిమ్మెంట్ రోడ్లు వేయించిన ఘనత తమకే దక్కుతుందన్నారు. 

చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతలా అభివృద్ధి చేశారో ప్రజలకు, అసెంబ్లీలో ఉన్న ప్రతీ శాసన సభ్యుడికి తెలుసునన్నారు అచ్చెన్నాయుడు. సిమ్మెంట్ రోడ్లు, డ్రైనేజీలు, వేస్ట్ సాలిడ్ మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలు నిర్వహించామని ఆనాడు సర్పంచ్ లు సైతం ఆనందం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. 

మెటీరియల్ కాంపొనెంట్ కింద జరిగిన పనులకు రూ.1845 కేంద్రం విడుదల చేయాల్సి ఉందని అందుకు ప్రభుత్వం మూడుసార్లు లేఖలు రాసిందని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించి నిధులు కూడా కేంద్రం మంజూరు చేసిందన్నారు.  

కేంద్రప్రభుత్వం ఈ ఏడాది మూడు పర్యాయాలుగా మెుత్తం రూ.1845 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. పనులకు సంబంధించి, బిల్లులు పూర్తి చేశారని, సోషల్ ఆడిటింగ్ పూర్తైందని అయితే కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. 

ఆ నాయుడు మీ చుట్టం కాదా, అన్నీ బయటపెడతాం: చంద్రబాబుపై జగన్..

కేంద్రం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టించారా అంటూ నిలదీశారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లను, సర్పంచ్ లను ఇబ్బంది పెట్టాలనో తెలియదు గానీ వారికి బిల్లులు చెల్లించడం లేదని వాపోతున్నారని తెలిపారు. 

కాంట్రాక్ట్ పనులు చేపట్టిన సర్పంచ్ లు తమకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిధులు విడుదల చేయాల్సిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి విచారణ పేరుతో సర్పంచ్ లను మరింత ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. 

జాతీయ ఉపాధి హామీ పథకం ఉపయోగించుకుని దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికే చెందిందని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అయితే పులివెందుల, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు మాత్రమే జాతీయ ఉపాధిహామీ పథకం నిధులను మంజూరు చేసినట్లు తమకు సమాచారం ఉందని అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిధులు మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు...

Follow Us:
Download App:
  • android
  • ios