ఆర్ధికంగా వెనుకబడిన వారికి తమ హాస్పిటల్‌లో వైద్య ఖర్చులు, స్టెంట్లపై రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులకు రాయితీతో చికిత్స అందిస్తామంటున్నారు అను న్యూరో అండ్ కార్డియాక్ సెంటర్ ఎండీ డాక్టర్ జి.రమేష్. విజయవాడలోని సూర్యారావుపేట లోగల అను హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పేదవారికి కూడా అత్యాధునిక వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి రాయితీతో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వారికి తమ హాస్పిటల్‌లో వైద్య ఖర్చులు, స్టెంట్లపై రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు.
కేవలం రూ.60 వేలకే యాంజియోప్లాస్టీ, ఒక స్టెంట్, రూ.90 వేలకు యాంజియోప్లాస్టీ, రెండు స్టెంట్లను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా కేవలం రూ.449లకే ఈసీజీ, ఎకో పరీక్షలు, రూ.999లకే ట్రెడ్ మిల్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గుండెపోటుతో బాధపడుతున్న వారికి కేవలం రూ.2 వేలకే ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్ రమేష్ వెల్లడించారు.
ఎనికేపాడులోని అను న్యూరో అండ్ కార్డియాక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
