ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఫిర్యాదులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బెదిరింపులు, వసూళ్లు పేరిట కోడెల కుమార్తె, కుమారుడు తమను బెదిరించారంటూ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.

తాజాగా గురువారం మరో ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 5 లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ కోడెల కుమార్తె డాక్టర్ విజయలక్ష్మీపై యాసిన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అలాగే తన దగ్గర రూ.44 లక్షలు తీసుకున్నారంటూ చంద్రశేఖర్ అనే వ్యాపారి కోడెల కుమారుడు శివరామ్‌ పై ఫిర్యాదు చేశారు.