Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ చేతికి బ్రహ్మాస్త్రం

  • వైసీపీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించి మంత్రులైన భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, ఎన్.అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 
  • ఉపఎన్నికతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబునాయుడుకు తాజాగా నలుగురు మంత్రులకు కోర్టు నోటీసులు జారీ చేయటం మరింత ఇబ్బందికరమే.
  • ఈ నాలుగు వారాల్లోనే గనుక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైతే చంద్రబాబుకు మరింత ఇబ్బందే.
  • నలుగురు ఫిరాయింపు మంత్రులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి
Another setback to naidu

నంద్యాల ఉప ఎన్నిక నేపధ్యంలో ఫిరాయింపులపై వైసీపీకి  బ్రహ్మస్త్రం దొరికింది. ఫిరాయింపు ఎంఎల్ఏ నియోజకవర్గంలో జరుగనున్న ఉపఎన్నికలో బిజీగా ఉన్న నలుగురు పిరాయింపు మంత్రులకు కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కోర్టు నోటీసుల్లో పేర్కొంది. దాంతో ఇటు చంద్రబాబునాయుడుకే కాకండా అటు నలుగురు మంత్రులకు కూడా ఓ విధంగా షాక్ కొట్టినట్లే.

వైసీపీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించి మంత్రులైన భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, ఎన్.అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించటం రాజ్యాంగ విరుద్ధమంటూ శివప్రసాద్ అనే జర్నలిస్టు దాఖలు చేసిన కేసును హైకోర్టు పరిశీలించింది. అదే విషయమై సమాధానం చెప్పాలంటూ నలుగురు ఫిరాయింపు మంత్రులకు నాలుగు వారాల గడువిచ్చింది.

అసలే, ఉపఎన్నికలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబునాయుడుకు తాజాగా నలుగురు మంత్రులకు కోర్టు నోటీసులు జారీ చేయటం మరింత ఇబ్బందికరమే. ఈ నాలుగు వారాల్లోనే గనుక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైతే చంద్రబాబుకు మరింత ఇబ్బందే. ఎందుకంటే, భూమా నాగిరెడ్డి మరణం వల్లే నంద్యాలలో ఉపఎన్నిక అవసరమైంది. విచిత్రమేంటంటే భూమా కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే. అంటే ఫిరాయింపు ఎంఎల్ఏ మరణం వల్ల జరుగనున్న నంద్యాల ఉపఎన్నికలో మిగిలిన నలుగురు ఫిరాయింపు మంత్రులు బాగా యాక్టివ్ గా ఉండంటం.

ఇపుడు కోర్టు ఆదేశాల రూపంలో వైసీపీకి బ్రహ్మాస్త్రం దొరరికినట్లైంది. ఎందుకంటే, ఫిరాయింపులకు వ్యతిరేకంగా వైసీపీ ఎంఎల్ఏలు కూడా కోర్టులో పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఉపఎన్నిక హీట్ పెరిగిపోతున్న సమయంలో కోర్టు స్పందించి నలుగురు మంత్రులకు నోటీసులు జారీ చేయటమంటే మామూలు విషయం కాదు. రేపు ప్రచారంలో ఫిరాయింపు మంత్రులు జనాలకు ఏమని చెబుతారు? అడ్డుగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రచారంలో ఏం మాట్లాడుతారు? కోర్టుకు  ఈ నలుగురు ఫిరాయింపు మంత్రులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. పనిలో పనిగా తెలంగాణాలో ఫిరాయింపు మంత్రి తలసానిని కూడా కలపి నోటీసులు ఇవ్వటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios