హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం టంగుటూరు మండలంలోని మైనింగ్ భూములను కేటాయిండంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

మైనింగ్ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సదరు మైనింగ్ భూమి కేటాయింపుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.