విశాఖపట్నం: ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న నాలుగురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు బంగాళాఖాతంను ఆనుకుని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మరింత తీవ్రతరం అయ్యిందని తెలిపారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారనుందని... ఇది వచ్చే సోమవారం ఉత్తరాంధ్రంలో తీరం దాటే అవకాశముందన్నారు.  

ఈ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురివనున్నాయని ప్రకటించారు. సముద్ర తీరం వెంట గంటకు 45నుంచి 65కి.మీ వేగంతో గాలులు వీయడంతో పాటు రాష్ట్రంమొత్తం భారీ వర్షాలు కురుస్తాయని... కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. 

ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో వర్షం తీవ్రత అధికంగా వుండనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తమై వర్షం తీవ్రత అధికంగా వుండే చోట్ల లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఆదివారం 

కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని....మిగిలినచోట్ల విస్తారంగా మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం కురుస్తాయని వెల్లడించారు.

సోమవారం

కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని... మిగిలినచోట్ల విస్తారంగా మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశాలున్నాయట.

మంగళవారం

ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు...కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల విస్తారంగా మోస్తారు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశాలున్నాయని  తెలిపారు.