దూసుకొస్తున్న మరో తుఫాను ముప్పు: బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం

Cyclone: రెండు తుఫానుల కారణంగా అక్టోబర్ చివరి వారంలో భారతదేశం తుఫాను తీవ్ర‌ ప్ర‌భావాల‌ను ఎదుర్కొనే అవకాశం క‌నిపిస్తోంది. ఒకటి బంగాళాఖాతంలో.. మరొకటి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడ్డాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, అరేబియా సముద్రంలో 'తేజ్' అనే తుఫాను అల‌జ‌డి రేప‌గా, ఇదే స‌మ‌యంలో 'హమూన్' బంగాళాఖాతంలో ఏర్ప‌డుతోంది.
 

Another cyclonic storm threat: Hamoon Cyclone intensifies into Bay of Bengal Impact on North Andhra RMA

Hamoon Cyclone: ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలపై అరేబియా మహాసముద్రంలో తేజ్‌ తుఫాన్ ప్రభావం చూపుతోంది. ఇదే క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మరో తుఫాను దూసుకొస్తున్న‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. బంగాళాఖాతంలో హమూన్‌ తుఫాన్‌ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని కార‌ణంగా ఉత్తరాంధ్రపై ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే.. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 21న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి యూనిట్ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతుందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్ర‌స్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతోంద‌ని తెలిపింది. పారాదీప్‌కు దక్షిణంగా 430 కిమీ దూరంలో కేంద్రీకృతమైంద‌నీ, నేడు హమున్ తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో మేఘావృతమైన వాతావ‌ర‌ణం ఉంటుంద‌నీ,  శ్రీకాకుళంతో పాటు ప‌లు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంద‌ని తెలిపింది.

రెండు తుఫానుల కారణంగా అక్టోబర్ చివరి వారంలో భారతదేశం తుఫాను తీవ్ర‌ ప్ర‌భావాల‌ను ఎదుర్కొనే అవకాశం క‌నిపిస్తోంది. ఒకటి బంగాళాఖాతంలో.. మరొకటి అరేబియా సముద్రం మీదుగా ఏర్పడ్డాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, అరేబియా సముద్రంలో 'తేజ్' అనే తుఫాను అల‌జ‌డి రేప‌గా, ఇదే స‌మ‌యంలో 'హమూన్' బంగాళాఖాతంలో ఏర్ప‌డుతోంది. IMD-అమరావతి యూనిట్ ప్రకారం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 21 న ఏర్పడిన బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం మరింత పరిణామం చెంది తుఫానుగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ వ్యవస్థ అక్టోబరు 23 లేదా 24 తేదీల్లో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. వాయువ్య దిశగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. తదనంతరం, 'హమూన్' ఉత్తర-ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ, తీరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుందని అంచనా వేసింది.

బంగ్లాదేశ్-పశ్చిమ బెంగాల్ ల‌పై ప్ర‌భావం ఉంటుంద‌నీ, ఇది ముందుకు సాగుతున్న కొద్దీ మరింత  ప్ర‌భావం చూపుతుంద‌ని భావిస్తున్నారు. పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కొన‌సాగుతుండ‌గా, ఇది అక్టోబర్ 23 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తుంది. 'హమూన్' ఇంకా ప్రారంభ దశలో ఉండగా, ప్రస్తుతం దాని మార్గంలో ముందుకు కొనసాగుతోంది. ఇది ఆంధ్రా తీరానికి దగ్గరగా చేరుతోంది. ప్రైవేట్ వాతావరణ శాఖ స్కైమెట్ ప్రకారం, అక్టోబర్ 24 నాటికి ఈ వ్యవస్థ తుఫానుగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జంట తుఫానులు మళ్లీ ఏర్పడతాయని ఊహించినప్పటికీ, అవి ఒకదానికొకటి గణనీయమైన దూరాన్ని కలిగి ఉంటాయ‌నీ, దీంతో అవి వేరువేరుగానే కొన‌సాగుతాయ‌ని పేర్కొంటున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios