తిరుమలలోని అలిపిరి మార్గంలో మరో చిరుత చిక్కింది. వారం రోజుల నుంచి దానిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం రాత్రి అది బోనులో చిక్కుకుంది. 

తిరుమలలో ఎట్టకేలకు మరో చిరుత బోనులో చిక్కింది. దానిని బంధించడానికి వారం రోజుల నుంచి ఫారెస్టు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నా.. అది తృటిలో తప్పించుకొని తిరుగుతోంది. చివరికి సోమవారం ఉదయం 7 గంటల సమయంలో అది బోనులో చిక్కిందని అధికారులు పేర్కొన్నారు. 

అలిపిరి కాలి నడక మార్గంలో ఉంచిన బోనులో చిరుత చిక్కినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. వాస్తవానికి ఆ చిరుత రోజూ బోను వద్దకు వచ్చి వెనుదిరుగుతోంది. దీనిని సీసీ కెమెరాల్లో అధికారులు గుర్తించారు. కానీ సోమవారం ఉదయం మాత్రం నేరుగా బోనులోకి వెళ్లింది. ఈ చిరుతతో కలిపి మొత్తం నాలుగింటిని అధికారులు ట్రాప్ చేసినట్లయ్యింది.

BRS: బీఆర్ఎస్ కు త‌ల‌నొప్పిగా మారుతున్న సొంత నాయ‌కుల వ్యాఖ్య‌లు !

ఈ నెల 17వ తేదీన తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఓ చిరుత చిక్కుకుంది. అంతకుమూడు రోజుల ముందు కూడా అలిపిరి మెట్ల మార్గంలోని ఏడో మైలు వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది. దానిని ఈ నెల 11వ తేదీన చిన్నారి లక్షితపై దాడి చేసిన మృగమే కావచ్చని భావిస్తున్నారు.