హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద మరో కేసు నమోదైంది. ఇప్పటి వరకు జగన్ మీద సిబీఐ 11, ఈడి 6 కేసులు నమోదు చేసింది. తాజాగా జగన్ మీద ఈడి మరో కేసు నమోదు చేసింది. దీంతో జగన్  మీద నమోదైన కేసుల సంఖ్య 188కి చేరుకుంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ హౌసింగ్ బోర్డు, ఇందూ కెంపనీల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరుడు దాఖలు చేసిన చార్జిషీట్ మీద ఇటీవల ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. 

నిరుుడ ఈడి చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే అందులో లోపాలు ఉండడంతో కోర్టు దాన్ని వెనక్కి పంపించింది. దాంతో ఈడి సమగ్రమైన వివరాలతో చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై ఏప్రిల్ 23వ తేదీన విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం అది మరోసారి విచారణకు వచ్చింది. ఆ విచారణ జూన్ 30వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో 11 మందిని నిందితులుగా చేర్చింది. 

నిందితుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి, ఐ శ్యాంప్రసాద్ రెడ్డి, జితేంద్ర మోహన్ దాస్ వీర్వాణి, వైవీ సుబ్బారెడ్డి, ప్రస్తుత వైసిపి ఎమ్మెల్యే వివి కృష్ణప్రసాద్ లు ఉన్నారు. అదే విధంగా ఇందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందూ ఈస్ట్రన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్  ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. 

నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4,3 కింద ఫిర్యాదు దాఖలు చేసింది. దానిపై తిరిగి జూన్ 30వ తేదీన విచారణ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఈడి ఇప్పటికే రూ.117 కోట్ల ఆస్టులను జప్తు చేసింది. 

జగన్ మీద నమోదైన కేసుల్లో తొలిసారి విజయసాయి రెడ్డి పేరు లేదు. సిబిఐ నంోదు చేసిన 11 కేసుల్లోనూ ఈడి ఇప్పటి వరకు దాఖలు చేసిన 6 కేసుల్లోనూ విజయసాయి రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. సిబిఐ కేసులో నిందితులుగా జగన్ కు చెందిన కార్మెల్ ఏసియా లిమిటెడ్ ను, ఐఏఎస్ అధికరాి మొహంతిలను కూడా జాబితా నుంచి ఈడి తొలగించింది.