Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ అరెస్ట్

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను ఏపీ సీఐడీ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్‌ ధరను పెంచడంలో భాస్కర్‌ది కీలకపాత్ర అని ఏపీ సీఐడీ అనుమానిస్తోంది.

another arrest in ap skill devlopment scam ksp
Author
First Published Mar 25, 2023, 6:14 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో అరెస్ట్ చోటు చేసుకుంది. సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను ఏపీ సీఐడీ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ కోర్టులో హాజరుపరచనుంది సీఐడీ. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్‌ ధరను పెంచడంలో భాస్కర్‌ది కీలకపాత్ర అని ఏపీ సీఐడీ అనుమానిస్తోంది. ప్రోగ్రామ్ ధరను రూ.3300 కోట్లుగా ప్రభుత్వానికి చూపించింది భాస్కర్ అండ్ కో. 3300 కోట్లుగా ధర నిర్ణయించి.. రూ.371 కోట్లు కొట్టేసింది భాస్కర్ అండ్ కో . 

Also REad: చంద్రబాబు దోపీడీ విజన్: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్‌ స్కాంపై అసెంబ్లీలో జగన్

కాగా.. కాగా..చంద్రబాబు నాయడు సీఎంగా ఉన్న సమయంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లో రూ. 241 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబైకి చెందిన శిరీష్ చంద్రకాంత్‌‌, మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్‌ గంటా సుబ్బారావును అరెస్ట్ చేసింది ఈడీ. 

Follow Us:
Download App:
  • android
  • ios