చంద్రబాబు దోపీడీ విజన్: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్‌ స్కాంపై అసెంబ్లీలో జగన్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  లో జరిగిన అవినీతి గురించి  ఏ.పీ సీఎం వైఎస్ జగన్  ఏపీ అసెంబ్లీలో  ఇవాళ  ప్రసంగించారు

Rules  Violations  In  AP Skill Development Scam: AP CM YS Jagan lns

అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కాంలో  చంద్రబాబు నాయుడు దోపీడీ విజన్ కన్పిస్తుందని  ఏపీ సీఎం జగన్ విమర్శించారు.  సోమవారంనాడు ఏపీ అసెంబ్లీలో  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  స్కాంపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రసంగించారు.  స్కాం  చేయడం  నుండి తప్పించుకోవడం  వరకు బాబు  విజన్ కన్పిస్తుందన్నారు.  స్కిల్ డెవలప్ మెంట్  కార్పోరేషన్ లోకి  స్వంత  మనుషులను  తీసుకువచ్చి కథ నడిపించారన్నారు.  ఇందులో  ఓ టెండర్ ప్రక్రియ కూడా  చేపట్టలేదని  సీఎం  చెప్పారు.   సీమెన్స్ లోని ఉన్నత ఉద్యోగితో  లోపాయికారి  ఒప్పందం  చేసుకున్నారని  చంద్రబాబుపై  జగన్  ఆరోపణలు  చేశారు. 

ఈ ప్రాజెక్టు  మొత్తం  ఖర్చు  రూ.  3,356  కోట్లు, ఇందులో  ప్రభుత్వ వాటా  కేవలం  10 శాతం మాత్రమేనని  సీఎం జగన్  చెప్పారు. 90 శాతం  సీమెన్స్ సంస్థ  భరిస్తుందని   చంద్రబాబు సర్కార్  చెప్పిందన్నారు. ఎక్కడైనా  ఓ ప్రైవేట్  కంపెనీ  రూ.3 వేల కోట్లు గ్రాంట్ గా  ఇస్తుందా అని  సీఎం జగన్  ప్రశ్నించారు.  చంద్రబాబు  ముఖం  చూసి గ్రాంట్ గా  ఇచ్చారా ? అని  ఏపీ సీఎం జగన్  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

ఈ ప్రాజెక్టుకు  కనీసం డీపీఆర్ ను కూడా తయారు చేయలేదని  ఏపీ సీఎం  జగన్  చెప్పారు.  స్వంతంగా  తయారు  చేసుకున్న  డీపీఆర్ తో ప్రతిపాదనలు పెట్టించారని  సీఎం జగన్  ఆరోపించారు.  

దేశ  చరిత్రలోనే స్కిల్ డెవలప్ మెంట్  స్కాం అతి పెద్దదన్నారు.  యువతకు  స్కిల్ డెవలప్ మెంట్  పేరుతో  గత ప్రభుత్వం  అడ్డగోలుగా  దోచుకుందని సీఎం జగన్  ఆరోపించారు.  చంద్రబాబు చేసిన అతి గొప్ప స్కిల్  ఇది  అని  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.  విదేశీ లాటరీ  తరహలో  స్కిల్  డెవలప్ మెంట్  స్కాంకు తెరతీశారని  ఏపీ సీఎం జగన్  విమర్శించారు.   ఇడి  ఓ స్కిల్డ్  క్రిమినల్  చేసిన స్కాం  అని  సీఎం  జగన్  చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బును మళ్లించి  స్కామ్  చేశారని  ఏపీ సీఎం  జగన్  తెలిపారు.  

 కేబినెట్ లో  చెప్పి  జీవో  విడుదల చేసిన తర్వాత  ఒప్పందాన్ని మార్చేశారని  సీఎం జగన్  వివరించారు. ప్రజా ధనాన్ని  దోచేయడంలో  చంద్రబాబు  చాతుర్యానికి స్కిల్ స్కామే  ఓ ఉదహరణ అని  జగన్  ప్రస్తావించారు.  

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  కేసును  జీఎస్టీ,  సీఐడీ, ఈడీ , ఇంటలిజెన్స్ సంస్థలు  దర్యాప్తు చేస్తున్నాయని  సీఎం వివరించారు. చంద్రబాబు, ఆయన  మనుషులు  ముఠాగా  ఏర్పడి  పద్దతి  ప్రకారంగా  రూ. 371 కోట్లు దోచుకున్నారని  ఏపీ సీఎం  జగన్  ఆరోపించారు.    కేబినెట్ లో  తెచ్చిన  జీవో స్వరూపాన్ని  పూర్తిగా మార్చేశారన్నారు. ఒప్పందానికి వచ్చేసరికి  90 శాతం  గ్రాంట్  ఇన్ ఎయిడ్ అనే ప్రస్తావనే లేదని  జగన్ గుర్తు  చేశారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios