ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో (AP Skill development Scam) మరొకరిని అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు. ముంబైకి చెందిన శిరీష్ చంద్రకాంత్‌‌ను (chandrakanth shah) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో వుంటూ దేశవ్యాప్తంగా వందలాది షెల్ కంపెనీలను (shell companies0సృష్టించాడు శిరీష్. పలు కేసులకు సంబంధించి ఇతని కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం వేటాడుతున్నాయి.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో (AP Skill development Scam) మరొకరిని అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు. ముంబైకి చెందిన శిరీష్ చంద్రకాంత్‌‌ను (chandrakanth shah) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో వుంటూ దేశవ్యాప్తంగా వందలాది షెల్ కంపెనీలను (shell companies0సృష్టించాడు శిరీష్. పలు కేసులకు సంబంధించి ఇతని కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం వేటాడుతున్నాయి. చివరికి ఏపీ సీఐడీకి చంద్రకాంత్ షా దొరికాడు. రూ.242 కోట్ల స్వాహా కోసం చంద్రకాంత్‌ను వినియోగించుకున్నారు కొందరు వ్యక్తులు. షెల్ కంపెనీల ఏర్పాటులో చంద్రకాంత్‌ దిట్టగా చెబుతున్నారు. ఇతనితో కలిపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. 

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణకు (lakshmi narayana) ఏపీ హైకోర్టు సోమవారం నాడు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. 15 రోజుల పాటు ముందస్తు బెయిల్ ను చేసింది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ (ap cid) సోదాలు నిర్వహించింది. ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం స్టార్‌ ఆస్పత్రిలో ఐసీయూలో లక్ష్మీనారాయణ ఉన్నారు.

Also Read:AP Skill development Corporation Scamలో రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీనారాయణకు ఊరట: మధ్యంతర బెయిలిచ్చిన హైకోర్టు

మందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఏపీ హైకోర్టు లక్ష్మీనారాయణకు బెయిల్ మంజూరు చేశారు.. సీఐడీ తనిఖీలు జరుపుతుండగానే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

చంద్రబాబునాయడు (chandrababu naidu) సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లో రూ. 242 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు.