AP Skill development Corporation Scamలో రిటైర్డ్ ఐఎఎస్ లక్ష్మీనారాయణకు ఊరట: మధ్యంతర బెయిలిచ్చిన హైకోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఈ స్కాంలో  సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేశారు. ఈ నెల 10న లక్ష్మీనారాయణ నివాసంలో కూడా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు

AP  Skill development Corporation Scam:AP High Court Grants Anticipatory Bail To Ex- IAS Officer Laxmi Narayana

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం లో మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు సోమవారం నాడు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.15 రోజుల పాటు ముందస్తు బెయిల్ ను చేసింది.ఈ నెల 10న హైదరాబాద్‌లోని లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. ఇవాళ విచారణకు రావాల్సిందిగా ఆయనకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం స్టార్‌ ఆస్పత్రిలో ఐసీయూలో లక్ష్మీనారాయణ ఉన్నారు. మందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఏపీ హైకోర్టు లక్ష్మీనారాయణకు  బెయిల్ మంజూరు చేశారు..  సీఐడీ తనిఖీలు జరుపుతుండగానే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఐసీయూలో డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

also read:AP Skill development Corporation scamలో సీఐడీ దూకుడు: పుణెలో ముగ్గురి అరెస్ట్

 Skill development Scam  26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సీఐడీ అధికారులు. మాజీ స్పెషల్ సెక్రటరీ గంటా సుబ్బారావు , మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణపై  కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ సిస్టం, పాత్రిక్ సర్వీస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, ఇన్‌ వెబ్ సర్వీస్‌లపైనా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ, పుణేలకు చెందిన పలువురు కంపెనీ డైరెక్టర్లపైనా కేసు నమోదు చేశారు. ఆదివారం నాడు పుణెకు చెందిన షెల్ కంపెనీపై ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఆదివారం నాడు ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.  

చంద్రబాబునాయడు సీఎంగా ఉన్న సమయంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లో రూ. 242 కోట్ల కుంభకోణం చోటు చేసుకొందని ఏపీ సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అక్రమాల్లో షెల్ కంపెనీల ప్రమేయం ఉందని ఏపీ సీఐడీ గుర్తించింది.గత ప్రభుత్వ హయంలో సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు దర్యాప్తులో తేల్చారు.డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.242 కోట్ల నగదు చేతులు మారినట్టుగా సీఐడీ అధికారులు నిర్ధారించారు. సీమెన్స్, డిజెన్స్ టెక్ సంస్థలు షెల్ కంపెనీలుగా వ్యవహరించాయనీ సీఐడీ అధికారులు నిర్ధారించారు.  

ముంబై, పుణెకు చెందిన షెల్ కంపెనీలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించినట్టుగా  సీఐడీ గుర్తించారు.  ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకుండాను ఇచ్చినట్టుగా నకిలీ ఇన్ వాయిస్ లు సృష్టించారని కూడా సీఐడీ అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా పుణే కేంద్రంగా సీఐడీ అధికారులు సోదాలు చేశారుత. ఆదివారం నాడు పుణెలో ముగ్గురు అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో  ఏ6 గా ఉన్న సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఏ8 గా వికాస్ కన్విల్కర్, ఏ10 గా ముకుల్ అగర్వాల్  పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ ముగ్గురిని ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.  వైద్య పరీక్షల అనంతరం వారిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురు నిందితులకు 12రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ కేసు విచారణను  ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ స్కామ్ లో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా సమాచారం. ఈ విషయమై ఆధారాలను సేకరించే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులున్నారని తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios