కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పెట్టడాన్ని నిరసిస్తూ గత మంగళవారం అమలాపురంలో జరిగిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి విధ్వంసంలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.
కోనసీమ జిల్లా (konaseema district) అమలాపురంలో అల్లర్లకు (amalapuram violence) సంబంధించి మరో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 62కి చేరింది. మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో పోలీసులు వున్నారు. మరోవైపు అమలాపురంలో 144 సెక్షన్‌ను మరో ఐదు రోజులు పొడిగించారు పోలీసులు.
కాగా... కోనసీమ జిల్లాలో అలజడి నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. రాజ్యాగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కొనసీమ జిల్లాకు జతచేయడాన్నివ్యతిరేకిస్తూ అలజడి సృష్టించినవారిపై అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు తెలిపారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న 25 మందిని శనివారం అరెస్ట్ చేసినట్లు డిఐజి తెలిపారు. ఈ నిందితులను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలో డిఐజి కీలక వ్యాఖ్యలు చేసారు.
Also Read:కోనసీమ అల్లర్ల నిందితుల ఆస్తులు సీజ్... వారినుండే నష్టాన్ని రాబడతాం: డిఐజి పాలరాజు
అమలాపురం ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని డిఐజి తెలిపారు. మొత్తం 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా అమలాపురంలో అల్లర్లకు పథకరచన జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులు ఈ అల్లర్లలో ధ్వంసమయ్యాయని... ఈ నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని అన్నారు. ఇందుకోసం నిందుతుల ఆస్తులను సీజ్ చేయనున్నట్లు డిఐజి పాలరాజు హెచ్చరించారు. అమలాపురంలోని సిసి కెమెరాల్లో రికార్డయిన పుటేజ్, అల్లర్ల సమయంలో పోలీసులు, మీడియా వీడియోలు, టవర్ లొకేషన్ లాంటి సాంకేతిక ఉపయోగించి నిందితుల గుర్తించాలమని డిఐజి తెలిపారు. ఇలా గుర్తించిన నిందితుల్లో ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
