పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేసింది. తమ పార్టీ ఎంపీలందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారని టీడీపీ గురువారం ప్రకటించింది. 

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమ పార్టీ హాజరువుతుందని వైసీపీ హాజరవుతుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ ప్రకటించిన మరుసటి రోజు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా అలాంటి ప్రకటనే చేసింది. తమ పార్టీ కూడా పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వేడుకకు హాజరవుతుందని గురువారం ప్రకటించింది.

వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి వై-కేటగిరీ భద్రత.. ఎందుకంటే ?

వచ్చే ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే ఈ వేడుకకు టీడీపీ ఎంపీలు హాజరవుతారని ఆ పార్టీ ప్రకటించినట్టు వార్తా సంస్థ ‘పీటీఐ’ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఒడిశా అధికార పార్టీ అయిన బిజూ జనతాదళ్ కూడా ప్రారంభోత్సవంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కాగా.. దీనిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయంలో నేడు ఆ పార్టీ స్పష్టతను ఇచ్చే అవకాశం ఉంది.

గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. అంతకు ముందు, కాంగ్రెస్‌తో సహా 19 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు మే 28న వేడుకను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇందులో ఆప్ లతో పాటు ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), శివసేన (యూబీటీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), భారత కమ్యూనిస్ట్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), జనతాదళ్ (యునైటెడ్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జేడీ) తదితర పార్టీలు బహిష్కరణ ప్రకటించాయి. 

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని, ప్రధాని కాదని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిర్ణయంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం దురదృష్టకరమన్నారు. ‘‘ఇది ఒక చారిత్రాత్మక ఘటన అని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ఇది రాజకీయాలకు సమయం కాదు... బహిష్కరించడం, కొత్త సమస్య నుంచి సమస్యలు సృష్టించడం అత్యంత దురదృష్టకరం. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలి’’ అని కోరారు.