ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ సోమవారం నుంచి మూతపడింది. ఎన్నికల ముందు వరకు ఈ క్యాంటీన్‌కి చక్కని ఆదరణ లభించింది. ముఖ్యమంత్రికి వినతులు ఇచ్చేందుకు వచ్చే ప్రజల నుంచి పోలీసు సిబ్బంది వరకు అందరికీ క్యాంటీన్‌ ఎంతో ఉపయోగపడేది.  

ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో.. భోజనం చేసేవారి సంఖ్య కూడా తగ్గింది. కనీస సంఖ్య కూడా క్యాంటీన్ కి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి క్యాంటీన్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

గతంలో చంద్రబాబు సీఎం గా ఉండేవారు కాబట్టి.. ఆయనను కలవడానికి వచ్చిన ప్రజలతో క్యాంటీన్ కిటకిటలాడేదని అధికారులు  చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వగా.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం జగన్ సీఎం కావడంతో... ఇక్కడికి వచ్చేవారి సంఖ్య తగ్గింది. దీంతో.. క్యాంటీన్ వినియోగదారుల సంఖ్య కూడా తగ్గిపోయింది.