తనపై భూఆక్రమణల ఆరోపణలు రావటం హాస్యాస్పదమన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు వింటున్న వారు నవ్వుకుంటున్నారని కూడా అనిత చెప్పారు. అయితే, మీడియాతో మాట్లాడిన అనిత ఏడ్వలేక నవ్వుతున్నట్లే కనిపించారు.
‘భూములు ఆక్రమించుకున్నట్లు విజయసాయిరెడ్డి నిరూపిస్తే కాళ్లు కడిగి నెత్తిన ఆ నీళ్ళని చల్లుకుంటా’ ఇది తాజాగా పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనిత స్పందన. భూ ఆక్రమణల ఆరోపణలపై అనిత ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందుకు రావటం గమనార్హం. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, తనపై భూఆక్రమణల ఆరోపణలు రావటం హాస్యాస్పదమన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు వింటున్న వారు నవ్వుకుంటున్నారని కూడా అనిత చెప్పారు. అయితే, మీడియాతో మాట్లాడిన అనిత ఏడ్వలేక నవ్వుతున్నట్లే కనిపించారు.
ఎందుకంటే, అనిత స్వభావం చాలా దూకుడుగా ఉంటుంది. ఏ విషయంపైనైనా దూకుడుగా స్పందిస్తారు. ఇక వైసీపీ పైన ఆరోపణలు చేసేటపుడు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అటువంటిది వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేరుగా అనిత పైనే భూ ఆక్రమణల ఆరోపణలు చేసారు. ఆరోపణలు కూడా దాదాపు 20 రోజులుగా చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు తర్వాత అదికూడా తన సహజ స్వభానికి విరుద్ధంగా. దానికి కారణమేమై ఉంటుందబ్బా?
