Asianet News TeluguAsianet News Telugu

అనిల్ కుమార్ యాదవ్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Anil Kumar Yadav Biography: వైసీపీలో దూకుడు స్వభావం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు. ప్రస్తుతం ఎన్నికల్లో జగన్న ఆదేశాల మేరకు స్వంత నియోజకవర్గాన్ని వదిలి నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ జీవిత, రాజకీయ చరిత్ర తెలుసుకుందాం

Anil Kumar Yadav Biography, Age, Caste, Children, Family, Political Career KRJ
Author
First Published Mar 19, 2024, 3:22 AM IST

Anil Kumar Yadav Biography: 

 బాల్యం, విద్యాభ్యాసం:

పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ..  1980 మార్చి 23న తిరుపాలయ్య, శైలిజా దంపతులకు నెల్లూరు జిల్లా అంబాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు, బాబాయి గ్రామస్థాయి రాజకీయాలలో పంచాయితీ ప్రెసిడెంట్లు గా పనిచేశారు. ఆయన పుట్టింది నెల్లూరు అయినా.. విద్యాభ్యాసం చైన్నైలో సాగింది. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చెన్నైలోని వెంగల సుబ్బారావు స్కూల్లో చదివించారు. తరువాత ఇంటర్ రత్నం జూనియర్ కాలేజీలో చదివించారు.  తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలని  MGR యూనివర్సిటీలోని SRM డెంటల్ కాలేజ్ బీడీఎస్ పూర్తి చేశారు. తాను డెంటల్ స్పెషలిస్ట్ గా చేసిన ప్రాక్టీస్ మాత్రం పెద్దగా చేయలేదు. 

రాజకీయ జీవితం

అనిల్ కుమార్ యాదవ్ బాబాయి సుధాకర్‌ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన వెనుదిరిగి చూడలేదు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. వీరి కుటుంబానికి ఆనం సోదరుల కుటుంబానికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీనికి తోడు 2008లో నెల్లూరు రెండు సెగ్మెంట్లుగా విడిపోయింది. ఒక సిగ్మెంట్ కి బీసీలకు టికెట్ ఇవ్వాలని ఆనం బ్రదర్స్ అనుకోవడంతో అలా.. అనిల్ కుమార్ కి కాంగ్రెస్ తరపున వైయస్ హయాంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించారు.

కానీ, ఖర్చు అంతా అనిల్ పెట్టుకోవడం అజమానిస్తూ మాత్రం ఆనంద్ సోదరులు చెలాయించడంతో వాళ్లతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో ఆనం బ్రదర్స్ వారి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలలో కేవలం 90 ఓట్ల అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ, అనిల్ నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. నెల్లూరు తన సిగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి తన అనుచరులతో నిత్యం ప్రజల్లోనే ఉండేవాడు. 

వైసీపీలో చేరిక

ఆ తరువాత వైయస్సార్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.  2011లో జగన్ పెట్టిన వైఎస్ఆర్సిపి లో చేరి జగన్ తో ఇంకా బలమైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వైసిపి తరఫున ఏ కార్యక్రమం జరిగిన ముందుండి చురుకుగా ఉండేవారు. 2012లో వైఎస్ జగన్ జైల్లో పెట్టిన 16 నెలలు నిరసనగా బ్లాక్ అండ్ బ్లాక్ లో తిరిగి జగన్ కు వీరభక్తుడయ్యాడు. ఆ తర్వాత 2014లో వైసిపి తరపున నెల్లూరు నుంచి పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపోర్టుతో టిడిపి అభ్యర్థి పై 19,500 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా 2014లో మొదటి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

                  ఆ తరువాత 2019 ఎలక్షన్స్ లో నారాయణ పై అత్యధిక మెజార్టీతో గెలుపొంది వైసీపీలో మంత్రి స్థాయి నాయకుడు అయ్యారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా తొమ్మిది సార్లు చూసానని చెప్పుకునే ఆయన ప్రస్తుత్తం పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శింస్తున్నారు. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను 2024 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి బరిలో దించారు వైఎస్ జగన్. మరీ ఈ ఎన్నికల్లో అనిల్ విజయం సాధించేనా? లేదా? వేచి చూడాలి.  

అనిల్ కుమార్  బయోడేటా..  

పేరు: పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ 
జననం: 1980 మార్చి 23 (వయసు 44)
స్వస్థలం: కొత్తూరు, అంబాపురం, నెల్లూరు జిల్లా. 
రాజకీయ పార్టీ: YSR కాంగ్రెస్
తల్లిదండ్రులు: పోలుబోయిన తిరుపాలయ్య , శైలమ్మ
జీవిత భాగస్వామి: జాగృతి
సంతానం    : పాప సమన్వి , బాబు ధర్మనందన్‌
నివాసం: నెల్లూరు జిల్లా
 

Follow Us:
Download App:
  • android
  • ios