విశాఖపట్నంలో ఓ అంగన్ వాడీ ఆయా దాష్టీకానికి పాల్పడింది. మూడున్నరేళ్ల చిన్నారి ముఖం మీద అగ్గిపుల్లతో గీసింది. దీంతో ఆ చిన్నారి గాయాలపాలయ్యింది. 

విశాఖపట్నం : చిన్నారులను తల్లిని మరిపించేలా చూసుకోవాల్సిన అంగన్ వాడీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడున్నరేళ్ల చిన్నారిపై ఆయా దాష్టీకానికి ఒడి గట్టింది. చిన్నారి అల్లరి చేస్తోందని కోపానికి వచ్చింది. ఆమె ముఖంపై అగ్గిపుల్లతో చురకలు పెట్టింది. ఈ దుర్మార్గమైన ఘటన విశాఖ నగరంలోని సీతంపేట పరిధి రాజేంద్రనగర్ లో వెలుగు చూసింది. 

ఇక్కడి కనకమ్మ వారి వీధి అంగన్ వాడీ కేంద్రానికి చిన్నారి వస్తుంది. అక్కడ రేష్మ అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. బుధవారం ఉదయం అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు ఆటా, పాటలు నేర్పిస్తున్నారు. ఈ సమయంలో ఆ చిన్నారి అల్లరి చేస్తుంది. చెబితే వినడం లేదు. దీంతో కోపానికి వచ్చిన రేష్మ అగ్గిపుల్ల వెలిగించి.. ముఖం మీద చురకలు పెట్టింది. 

కర్నూల్‌లో ఏటీఎం చోరీకి దొంగల ముఠా యత్నం: పారిపోతూ పోలీసులపైకి కాల్పులు

ఈ అంగన్ వాడీ బిల్డింగ్ ఉన్న పై అంతస్తులోనే సీడీపీఓ కార్యాలయం ఉంది. అక్కడే చిన్నారులపై ఇలాంటి ఘటన జరిగితే ఇతర కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సీడీపీఓ జి. శ్రీలత మాట్లాడుతూ.. సూపర్ వైజర్ ను బాలిక ఇంటికి పంపించామని, ఘటన మీద విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఆయామీద చర్యలు తీసుకుంటామన్నారు.